EPFO: 40 లక్షల మంది EPF ఖాతాదారులకు ఈపీఎఫ్ఓ షాకింగ్ న్యూస్

ఈపీఎఫ్ఓ తన ఖాతాదారులకు 8.5 శాతం వడ్డీని అందించనున్నట్లు గత ఏడాది తెలిపింది. జనవరి 2021లో ఈపీఎఫ్ వడ్డీ నగదు చెల్లింపులు చేసింది. 

1 /5

ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(EPFO)లో మొత్తం దాదాపుగా 60 మిలియన్ల మంది(6 కోట్లు) ఈపీఎఫ్ ఖాతాదారులు ఉన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులకు ఈపీఎఫ్ ఖాతాలు ఉన్నాయి. 2019-20 సంవత్సరానికిగానూ ఈపీఎఫ్ వడ్డీని కేంద్ర కార్మికశాఖ మంత్రి, ఈపీఎఫ్ఓ జమ చేసింది. Also Read: EPFO: జాబ్ మానేసిన ఖాతాదారులకు ఈపీఎఫ్ఓ గుడ్ న్యూస్, ఇకనుంచి పాత కంపెనీతో పనిలేదు

2 /5

ఈ క్రమంలో 40 లక్షల మంది ఈపీఎఫ్ ఖాతాదారులకు ఈపీఎఫ్ఓ షాకింగ్ న్యూస్ చెప్పింది. వీరికి ఇంకా పీఎఫ్ వడ్డీ నగదు జమ చేయలేదని స్పష్టం చేసింది. అందుకు కారణం KYC వివరాలు అని పేర్కొంది. Also Read: EPFO ఖాతాల్లో 8.5 శాతం వడ్డీ జమ, EPF Passbook Password మరిచిపోతే ఇలా చేయండి

3 /5

కేవైసీ తప్పిదాలు, వివరాలకు సరిపోలకపోవడానికి సంబంధిత సంస్థలతో పాటు ఉద్యోగులు కూడా కారణమని తెలుస్తోంది. అందువల్లే 40 లక్షల మంది ఈపీఎఫ్ ఖాతాదారులకు నగదు జమ కాలేదు. కేవైసీ డాక్యుమెంటేషన్ పూర్తి చేస్తే వీరికి వడ్డీ మొత్తం త్వరలో ఖాతాలో చేరనుంది. Also Read: EPF Balance Check: ఈపీఎఫ్ఓ ఖాతాల్లోకి EPF Interest జమ, మీ బ్యాలెన్స్ ఇలా చెక్ చేసుకోండి

4 /5

కాగా, 2019-20 సంవత్సరానికిగానూ ఈపీఎఫ్ఓ తన ఖాతాదారులకు 8.5 శాతం వడ్డీని అందించనున్నట్లు గత ఏడాది తెలిపింది. జనవరి 2021లో ఈపీఎఫ్ వడ్డీ నగదు చెల్లింపులు చేసింది. 

5 /5

మొత్తం 8 నుంచి 10శాతం ఈపీఎఫ్ఓ చందాదారులకు వడ్డీ చెల్లింపులు జరగలేదని, ఉద్యోగుల KYC వివరాలలో తప్పిదాలే అందుకు కారణమని ఓ అధికారి పేర్కొన్నారు. Also Read: EPF ఖాతాదారులకు EPFO సరికొత్త సదుపాయం, ఆ సమస్యకు పరిష్కారం